Pooja Hegde : వాటన్నిటికంటే 'రెట్రో' చాలా స్పెషల్ : పూజా హెగ్దే

Pooja Hegde : వాటన్నిటికంటే రెట్రో చాలా స్పెషల్ : పూజా హెగ్దే
X

దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే. ఇటీవలే 'దేవా' మూవీతో జర్నలిస్టు దియా పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.. తన అప్కమిం గ్ సినిమా 'రెట్రో'పై ఇంట్రెస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. 'నేను ఇప్పటివరకూ నటించిన చిత్రాలన్నీ గర్వపడేలాంటివే. వాటన్నిటికంటే 'రెట్రో' చాలా స్పెషల్. నాకు ప్రతీది ఇష్టమే. ఇందులోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు.. వాటిలోని ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. సెట్లో టీమ్ అందరూ ఎంతో ఎనర్జిటిక్ గా వర్క్ చేశారు. ప్రత్యేకించి నా క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఎడిటింగ్ లో ఉన్నందున ఇంకా నేను పూర్తి సినిమాను చూడలేదు. మూవీ పూర్తిగా చూడకుండానే ఇంత నమ్మకంగా ఉన్న' అని చెప్పారు. కాగా.. కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'రెట్రో' మే 1న విడుదల కానుంది. ఇందులో పూజా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సూర్య గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ పవర్ ఫుల్ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి.

Tags

Next Story