Vyooham : వ్యూహం రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్జీవీ

వ్యూహం (Vyooham) సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. సినిమాను రిలీజ్ చేసుకోవచ్చునని సెన్సార్ బోర్డు క్లియెరెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డెట్ పై వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో జాప్యం ఏర్పడింది. ఈ సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వైఎస్ జగన్ బయోపిక్ గా యాత్ర 2 సినిమా కూడా థియేటర్స్ లో రిలీజయింది. యాత్ర 2 ఎమోషనల్ కంటెంట్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంటే వ్యూహం ఎలా మెప్పిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com