Radhe Shyam: 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్‌లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.? రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా..

Radhe Shyam: రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.? రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా..
Radhe Shyam: హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు.

Radhe Shyam: ప్రస్తుతం మూవీ లవర్స్ ఎదురుచూపులు అన్నీ పాన్ ఇండియా సినిమాలపైనే ఉన్నాయి. అందులో ముందుగా 'రాధే శ్యామ్' విడుదల కానుంది కాబట్టి ప్రేక్షకుల దృష్టంతా దీనిపైనే ఉంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్, ట్రైలర్ అన్నీ డిజైన్ చేశారు. ఇక తాజాగా రిలీజ్ అయిన రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్‌లో ఈ ముద్దుగుమ్మను గమనించారా.? తను తెలుగులో హీరోయిన్‌గా చేసింది రెండు సినిమాలే అయినా.. అప్పుడే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.


మామూలుగా సినిమాల్లో హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత ఆశించినంత గుర్తింపు రాకపోతే వారు వేరే సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధమయిపోతున్నారు. అలా హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు. అందులో ఒకరే రిద్ది కుమార్.


రిద్ది కుమార్.. ఈ పేరు టాలీవుడ్‌లో పెద్దగా వినిపించలేదు. ఎందుకంటే తాను నటించిన రెండు సినిమాల్లో ఏ ఒక్కటీ కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ముందుగా మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది రిద్ది. ఆ సమయంలోనే ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొంది. పూనెలో జన్మించిన ఈ భామ ఓ తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.


రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'లవర్' సినిమాతో హీరోయిన్‌గా తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది రిద్ధి. ఈ మూవీ కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఆ వెంటనే 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఇది కూడా డిసాస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో తనకు ఇతర భాషా పరిశ్రమల నుండి కూడా పిలువు వచ్చింది.


రాధే శ్యామ్‌లో పూజా హెగ్డేతో పాటు పలువురు ఫారిన్ భామలు కూడా తళుక్కున మెరిసారు. అయితే ఇప్పటివరకు పూజాను తప్ప మరే ఇతర హీరోయిన్‌ను పెద్దగా హైలెట్ చేసి చూపించలేదు మూవీ టీమ్. కానీ రిలీజ్ ట్రైలర్‌లో మాత్రం రిద్ధిని ప్రత్యేకంగా చూపించారు. దీంతో ఈ సినిమాలో రిద్ధిది ఏదైన మలుపు తిప్పే పాత్ర ఏమో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story