Kantara 2 : కష్టాల్లో రిషబ్ శెట్టి.. చిక్కుల్లో కాంతారా -2

Kantara 2 : కష్టాల్లో రిషబ్ శెట్టి.. చిక్కుల్లో కాంతారా -2
X

కన్నడ నటుడు రిషబ్ శెట్టి కష్టాల్లో పడి పోయారు. ఆయన నిర్మిస్తున్న కాంతారా - 2 చిక్కుల్లో పడిపోయింది. ఈ సినిమా షూట్ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ కారణంగా అటవీ ప్రాంతం నాశనం అవుతోందని పేర్కొంటూ అక్కడి స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో షూట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ చిత్రబృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తుందని, పేలుడు పదార్థాలు ఉపయోగిస్తుందని ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల వినియోగం వల్ల మూగ జీవాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై అటు చిత్ర బృందానికి, ఇటు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్రబృందం దాడి చేసిందని పేర్కొంటూ స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు దీనిపై త్వరితగతిన స్పందించి, చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.

Tags

Next Story