Ritika Singh : అందుకే టాలీవుడ్ సినిమాలు చేయట్లేదు : రితికా సింగ్

గురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రితికా సింగ్. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రితికా సింగ్ బాక్సర్ గా నటించింది. రియల్ గానే ఈ అమ్మడు బాక్సర్ కావడంతో గురులో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో అడపాదడపా సినిమాల్లో నటించింది. ఆ సినిమాలేవి రితికాకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు అందుకోలేదు.
తమిళంలో మాత్రం వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తోంది. తాజాగా రితికా నటించిన సినిమా 'వళరి'. రీసెంట్గా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రితికా .. టాలీవుడ్లో తాను సినిమాలు చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలు ఒప్పుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పుకొచ్చింది. కథ, పాత్ర మనస్ఫూర్తిగా నచ్చితేనే నేను సినిమాకు కమిట్ అవుతానని వెల్లడించింది. ప్రస్తుతం తమిళ్ మంచి ఆఫర్లు వస్తున్నాయి కనుక టాలీవుడ్ గురించి ఆలోచన లేదనట్లుగా వ్యాఖ్యానించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com