Robin Hood Release : రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాకీస్: హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చిత్రంలోని సాంగ్స్, టీజర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు కారణాల వల్ల 2024 డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది మూవీ టీం. ఈ సినిమా ఇప్పుడు మార్చి 28న కానుంది. వేసవి ప్రారంభానికి ముందే విడుదలవుతున్న ఈ చిత్రం, ఉగాది సెలవులను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. హీరో నితిన్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. శ్రీలీల గ్లామర్ షోతో పాటు,
హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని సమాచారం. . మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, దయనంద్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com