Priya Bhavani : బన్నీతో రొమాన్స్ చేస్త.. ప్రియా భవాని శంకర్ సంచలన కామెంట్స్

Priya Bhavani : బన్నీతో రొమాన్స్ చేస్త.. ప్రియా భవాని శంకర్ సంచలన కామెంట్స్
X

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్, అందంతో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ప్రియా భవాని శంకర్. మొదట్లో న్యూస్ రీడర్ కెరీర్ ప్రారంభించిన ఈ భామ, ప్రసుత్తం అటు తమిళ చిత్రాలతో పాటు ఇటు టాలీవుడ్లోనూ నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. 'కల్యాణం కమనీయం' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆ తర్వాత గోపీచంద్ భీమా, సత్యదేశ్ జీబ్రా సినిమాల్లోనూ తళుక్కుమని మెరిసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఓ సందర్భంలో తన మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి. బన్నీతో బిగ్ స్క్రీన్ పై నటించాలని ఉంది. రొమాంటిక్ సీన్ లోనైనా పర్వాలేదు నటించేస్త’ అంటూ పేర్కొంది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. చివరిగా 'ఇండియన్ 2', 'డిమోంటీ కాలనీ 22’, ‘బ్లాక్’వంటి చిత్రాలతో అలరించిన భవాని.. ప్రస్తుతం 'ఇండియన్ 3'లో నటిస్తోంది.

Tags

Next Story