Ruhani Sharma : రుహానీ హ్యాపీ వైబ్స్.. ఫోటోలు వైరల్

ఫస్టూ మూవీతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసిన హీరోయిన్ రుహానీ శర్మ. చి.ల. సౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. చివరిసారిగా శ్రీరంగనీతులు సినిమాలో కనిపించింది. 'ఆగ్రా' తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి బోల్డ్ నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం మంచి ఆఫర్లకోసం ఎదురుచూస్తోంది. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు క్యూట్, హాట్ ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది రుహానీ. తాజాగా తన ప్రస్తుత జీవిత దశను ప్రతిబింబిస్తూ హ్యాపీగా అద్దంలో సెల్ఫీని షేర్ చేసింది. హాయిగా, రిలాక్స్ ఉన్న డ్రెస్సులు ధరించి, పెద్ద చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఈ ఫొటోలకు 'కళను సృష్టించడం, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం, అందమైన వాతావరణాన్ని స్వీకరించడం, కొత్త ప్రారంభాలకు, పనిలో ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈపిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com