Prabhas : ప్రభాస్ స్పిరిట్ కు ఏమైంది..?

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కానీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా లేనట్టుంది. షూటింగ్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనేలా ఉన్నాయి ప్లానింగ్స్. లేదంటే ఈ సమ్మర్ లో రావాల్సిన రాజా సాబ్ పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు విడుదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అటు ముందే ఒప్పుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ను ఆపేసి మరీ హను రాఘవపూడితో సినిమాకు ఓకే చెప్పాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఈ మూవీ ఏ స్టేజ్ లో ఉందనేది ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పరు కూడా. ఇక సందీప్ సినిమా విషయానికి వస్తే ఈ యేడాది ఆరంభంలోనే ప్రారంభం అవుతుందని అతను అంతకు ముందు నుంచే చెబుతూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. బట్ స్పిరిట్ విషయంలో ఏ అప్డేట్ లేదు.
ఇక కొన్ని రోజుల క్రితం ఈ సమ్మర్ లోనే స్పిరిట్ స్టార్ట్ అవుతుందనే న్యూస్ వినిపించాయి. ఆ మేరకు సందీప్ రెడ్డి కూడా లొకేషన్స్ ను వెదికేందుకు వెళ్లాడు. కొన్ని దేశాల్లో లొకేషన్స్ న కూడా ఫైనల్ చేసుకున్నాడు. బట్.. ఇప్పుడప్పుడే ఆ లొకేషన్స్ తో పని ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే స్పిరిట్ చిత్రీకరణ ఇప్పట్లో స్టార్ట్ కాదట. అక్టోబర్ లో ప్రారంభం ‘అవ్వొచ్చేమో’ అనే టాక్ వినిపిస్తోంది. అంటే సమ్మర్ లో ఎట్టి పరిస్థితిలోనూ స్టార్ట్ కాదని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. మరి అసలు ఈ స్పిరిట్ కు ఏమైంది. కథలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే సందీప్ అలాంటివాటికి ఆస్కారం ఇవ్వడు.
కొన్ని రోజుల క్రితం సందీప్ .. ప్రభాస్ కు కొన్ని కండీషన్స్ పెట్టాడు అనే వార్తలు వచ్చాయి. వాటి విషయంలోనే ప్రభాస్ ఇంట్రెస్ట్ గా లేడు అనేది తాజాగా వినిపిస్తోంది. ఫిజిక్ విషయంలో ఓకే కానీ.. ఇతర కండీషన్స్ విషయంలో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడనీ.. అందుకే సందీప్ ను వెయిటింగ్ లో పెడుతున్నాడా అంటూ గుసగుసలు పోతున్నారు. ఏదేమైనా కొన్ని మూవీస్ కోసం ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ కూడా ఆసక్తిగా చూస్తుంది. అలాంటివే మరింత ఆలస్యం అవుతుంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com