Sai Pallavi : ఎల్లమ్మగా సాయిపల్లవి!?

బలగం సినిమా సూపర్ హిట్ కావడంతో సెకండ్ మూవీపై దృష్టి సారించాడు దర్శకుడు వేణు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కనున్న రెండో సినిమా పేరు ఎల్లమ్మగా ఖరారు చేశారు. ఇది ఎల్లమ్మ తల్లి కథా నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని త్వరలో సినిమా మొదలు పెడతామని వేణు చెప్పారు. ఐతే బలగం సినిమాలో ఎక్కువగా అందరు కొత్త వారితోనే వేణు సినిమా లాగించాడు. కొత్త వారి దగ్గర నుంచి అతనికి కావాల్సిన ఎమోషన్ ని తీసుకున్నాడు. ఇప్పుడు వేణు ఎల్లమ్మ కోసం నితిన్ ని తీసుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా ఎల్లమ్మ టైటిల్ రోల్ సాయి పల్లవి చేస్తుందని ఒక న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. అయితే నితిన్, సాయి పల్లవి లాంటి స్టార్స్ ని హ్యాండిల్ చేయడం అన్నది కాస్త కష్టమేనన్న టాక్ ఉంది. వారికి పాత్రని ఎక్కిస్తే మాత్రం మరో అద్భుతం జరిగే అవకాశముందనే టాక్ లేకపోలేదు. ముఖ్యంగా సాయి పల్లవి ఈ సినిమా చేస్తుంది అనేది నిజమైతే సగం సినిమా సక్సెస్ అయినట్టే. వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com