Sai Pallavi : క్రేజీ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి

X
By - Manikanta |25 Nov 2024 11:15 AM IST
సౌత్ లేడీ పవర్ స్టార్ గా పేరుతెచ్చుకుంది మలయాళ కుట్టి సాయి పల్లవి. నిజానికి ఆమెను హీరోయిన్ గా కంటే తన సింపిల్లిసిటీనే చాలా మంది ఇష్టపడతారు. ఆ విషయంలో ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 2025 ఎండింగ్ లో మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోనున్నారట మేకర్స్. ఈ న్యూస్ తో రామ్ చరణ్, సుకుమార్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com