Ellamma Movie : సాయిపల్లవా.. కీర్తినా.. ఎల్లమ్మలో ఎవరు?

బలగం చిత్రంతో సత్తా చాటిన దర్శకుడు వేణు యెల్దండి డైరెక్షన్ లో రూపుదిద్దుకోబోతున్న సినిమా ఎల్లమ్మ. బలగం సినిమాలో పక్కా ఎమోషనల్ కథతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులను కట్టిపడేసిన వేణు.. ఎల్లమ్మ సినిమాతో తెలంగాణ జీవన చిత్రాన్ని మరోమారు ఆవిష్కరించాలని భావించాడు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ కాగా, ఈ మూవీలో హీరోయిన్ గా అందాల భామ సాయి పల్లవి నటించబోతున్నట్లు, కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ఏంటంటే 'ఎల్లమ్మ' మూవీ షూటింగ్ ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తుంటే.. చివరి నిమిషంలో సాయి పల్లవి డేట్స్ కుదరడం లేదు అని ఈ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ హీరోయిన్ కీర్తిని సంప్రదించినట్లు సమాచారం. ఇంతకు ఎల్లమ్మ సినిమాలో కీలక పాత్రలో నటించే ఆ నటీమణి ఎవరో తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com