Sai Pallavi : కేవలం పాత్ర కోసమే ఆలా చేశా

Sai Pallavi : కేవలం పాత్ర కోసమే ఆలా చేశా
X

తన సింప్లిసిటీతో లేడీ పవర్స్టార్గా పేరు తెచ్చుకున్నారు మలయాళ బ్యూటీ సాయి పల్లవి. సినిమాల్లో గ్లామర్ కన్నా పాత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ శివ కార్తికేయన్ తో అమరన్ అనే సినిమా చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా సాయి పల్లవి చేస్తున్న రెబెకా వర్గీస్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఈ పాత్ర గురించి సాయి పల్లవి మాట్లాడుతూ "నేను ఇప్పటి వరకూ బయోపిక్‌లో నటించలేదు. ఆ అవకాశం అమరన్ రూపంలో వచ్చింది. అందుకే సినిమాలో భావోద్వేగాలకు పూర్తి న్యాయం చేయాలనకున్నా. అందుకే ముకుంద్ సతీమణి ఇందు రెబెకాను కలిశా. ఆమెతో చాలా విషయాల గురించి మాట్లాడి పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ గురించి ఓ క్లారిటీ తెచ్చుకున్నాను. అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Tags

Next Story