Saif Ali Khan : సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

Saif Ali Khan : సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు
X

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో పలు విషయాలు అంతుచిక్కడం లేదు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి దాడి తర్వాత ఎలా తప్పించుకున్నాడు? బిల్డింగ్‌ లేఅవుట్ అతనికి ముందే తెలుసా? సైఫ్ ఆటోలోనే ఎందుకు వెళ్లారు? సైఫ్‌తో పెద్ద వారు కాకుండా 7 ఏళ్ల చిన్నారి ఎందుకు వెళ్లాడు? వంటి ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిందితుడు పోలీసులకు చిక్కితే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Tags

Next Story