Saif Son Movie on OTT : సైఫ్ కుమారుడి సినిమా నేరుగా ఓటీటీలోనే..

సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం. ఎంతోమంది స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పేరు నడనియాన్. ఈ మూవీని నేరుగా ఓటీ టీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com