Prabhas Salaar 2 : సలార్ 2 నా కెరీర్ లోనే బెస్ట్ అవుతుంది - ప్రశాంత్ నీల్

Prabhas Salaar 2 :  సలార్ 2 నా కెరీర్ లోనే బెస్ట్ అవుతుంది - ప్రశాంత్ నీల్
X

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ సూపర్ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అతి తక్కువ డైలాగ్స్, ఎక్కువ యాక్షన్ తో ప్రభాస్ రోరింగ్ కు బాక్సాఫీస్ షేక్ అయింది. అయితే అభిమానుల్లో ఎక్కడో ఓ చిన్న నిరాశ కనిపించింది. అయితే అది ఈ సారి ఉండదు అని చెబుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ 2 తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ అవుతుందంటున్నాడు. రైటింగ్ పరంగా చూస్తే తను కూడా ఊహించనంత గొప్పగా వచ్చిందనీ.. ఇంక ఆడియన్స్, ఫ్యాన్స్ ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన లైఫ్ లో చాలా తక్కువ విషయాల్లోనే కాన్ఫిడెంట్ గా ఉంటానని.. సలార్ 2 విషయంలో చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటున్నాడు.

ప్రశాంత్ నీల్ చెప్పిందాన్ని బట్టి సలార్ 2 ఆగిపోలేదు. హొంబలే పిక్చర్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి సలార్ 2 కష్టమే అనుకున్నారు చాలామంది. అందుకు కారణం ప్రభాస్ లైనప్. ఆయనిప్పుడు రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో ఉన్నాడు. ఈ మూడూ పూర్తి కావాలంటే మూడేళ్లు పడుతుంది. రాజా సాబ్ ఈ యేడాదే విడదలవుతుంది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఫౌజీ 2026లో ఉంటుంది. అటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా అదే యేడాది విడుదల కావొచ్చేమో.

ఏదేమైనా సలార్ 2పై ప్రశాంత్ నీల్ చెప్పింది చూస్తే ఈ మూవీ 2026 చివర్లో ప్రారంభం కావొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేస్తాం అని ముందే అనౌన్స్ చేశారు. సో.. ఆ తర్వాతే సలార్ 2 స్టార్ట్ అవుతుంది.

Tags

Next Story