Salaar: Part 1 : సలార్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయ్

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రోరింగ్ హిట్ సలార్ మూవీ రీ రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో కనిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తే జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, దేవరాజ్, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటించారు. సలార్ సీజ్ ఫైర్ అంటూ ఫస్ట్ పార్ట్ గా వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన కెరీర్ లో తను చూసిన ది బెస్ట్ డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అని కితాబు కూడా ఇచ్చాడు ప్రభాస్. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు కానీ.. సలార్ ను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ మేరకు సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ను రేపు (గురువారం) ఉదయం 11గంటల నుంచి ఓపెన్ కాబోతున్నాయి. 21న చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయినా డైనోసార్ వస్తోందంటే.. చిన్న సినిమాలు భయపడటం కామన్ కదా. పైగా వీళ్లు చాలా రోజులు ముందుగానే బుకింగ్స్ ఓపెన చేశారు. సో.. ఈ సారి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియన్స్ కూడా రీ రిలీజ్ లో హంగామా చేయడం ఖాయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com