Salaar Part 1 Ceasefire trailer: 'కేజీఎఫ్'కు మించి... ట్రైలర్ రిలీజ్

Salaar Part 1 Ceasefire trailer: కేజీఎఫ్కు మించి... ట్రైలర్ రిలీజ్
భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న 'సాలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ ట్రైలర్'

ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రుతి హాసన్‌ల రాబోయే చిత్రం 'సాలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాలలో ఒకటి. రీసెంట్ గా చిత్ర నిర్మాతలు, హోంబలే ఫిల్మ్స్, ఎట్టకేలకు యాక్షన్ మొదటి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సాలార్ ట్రైలర్ తీవ్రమైన కథనం, మనస్సును కదిలించే విజువల్స్‌లో థ్రిల్లింగ్ సంగ్రహావలోకనం అందిస్తుంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఈ కథ వెయ్యి ఏండ్ల క్రితం మొదలైంది అంటూ వాయిస్ తో ట్రైలర్ సాగుతుంది. మహమద్ గజనీ, చెంఘిజ్ ఖాన్ కంటే క్రూరమైన బంది పోట్లు.. కాన్సార్ అడవిని కోటగా మార్చుకున్నారు. కాలంతోపాటు అది పెద్ద సామ్రాజ్యంగా మారింది. దాని పెద్ద జగపతి బాబు. ఆయన కాలంలో కుర్చీ కోసం కుమ్ములాట మొదలవుతోంది. వ్యతిరేక వర్గం ప్రుధ్విరాజ్ కుమార్ ను చంపేయాలని ప్లాన్ చేస్తారు. తన కుమారుడిని దొరగా చూడాలని జగపతి బాబు కోరిక. అదే టైంలో జగపతిబాబు ఊరెళతాడు. ఇదే అదనుగా ఎటాక్ ప్లాన్ చేస్తారు. ఆ టైంలో తన స్నేహితుడి కోసం ప్రభాస్ వస్తాడు.

ఆ తర్వాత జరిగే యాక్షన్ 'KGF' కు మించినట్లుగా వుంది. మైనింగ్ గనుల్లో పోరాటం, కత్తులతో యుద్ధం వంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. మన ఆర్మీ ఎక్కడుంది అని ప్రుధ్వీరాజ్ కుమార్ అనగానే... ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. తన కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి అంటాడు. ఆ తర్వాత ప్రభాస్.. ప్లీజ్ ఐ. కైండ్ లీ రిక్వెస్ట్.. అనే డైలాగ్ తో ముగుస్తుంది.


ముందుగా 'సాలార్' వాయిదా పడింది

ముందుగా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సాలార్' వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. అయితే నవంబర్-డిసెంబర్ పూర్తిగా పలు మూవీస్ తో నిండినందున, డిసెంబర్ 22 న 'సాలార్' విడుదల చేయాలనే టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే షారుఖ్ 'డుంకీ' డిసెంబర్ 22, ఒకటిన్నర నుండి రెండేళ్ల తేదీని బుక్ చేసుకున్నారు. ముందుగా. 'సాలార్' నిర్మాత విజయ్ కిరగందూర్ ఒక జ్యోతిష్యుడితో మాట్లాడారని, ఆయన సలహా మేరకు డిసెంబర్ 22న తన చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని తెలిసింది.

'సాలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' గురించి

'KGF' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం సాలార్. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి స్టార్స్ కనిపించనున్నారు. ఇక 'సాలార్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story