Salaar Collections : టాప్ ఫైవ్ లో కూడా లేకుండా పోయిన సలార్

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ రీ రిలీజ్ లో అంచనాలను అందుకోలేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఆల్రెడీ ఉన్న తెలుగు సినిమాలకు చాలా దూరంలోనే ఆగిపోయింది. మామూలుగా బుక్ మై షోలో కనిపించిన ఉత్సాహం టికెట్స్ బుక్ చేసుకోవడంలో కనిపించలేదు అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రేయారెడ్డి, జగపతి బాబు, దేవరాజ్, బాబీసింహా కీలక పాత్రల్లో నటించారు. అయితే సినిమా రిలీజ్ అయిన కనీసం మూడేళ్లు కూడా కావడం లేదు. అందుకే పెద్దగా ఆసక్తి చూపించలేదు ఆడియన్స్ అనుకోవచ్చు. అందుకే మొదటి రోజు సలార్ కేవలం 3.24 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
ఇప్పటి వరకూ తెలుగు నుంచి మొదటి రోజు హయ్యొస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాలు చూస్తే ఇలా ఉన్నాయి.
గబ్బర్ సింగ్ - 7.01 కోట్లు
మురారి - 5.41 కోట్లు
బిజినెస్ మేన్ - 5.27 కోట్లు
ఖుషీ - 4.15 కోట్లు
సింహాద్రి - 4.01 కోట్లు
సలార్ - 3.24 కోట్లు
జల్సా - 3.20 కోట్లు
ఇంద్ర - 3.05 కోట్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - 2.90 కోట్లు
ఒక్కడు - 2.05 కోట్లు
సో ఈ లిస్ట్ లో సలార్ టాప్ 5 లో కూడా చోటు సంపాదించుకోలేకపోయింది. ఇలాంటి మూవీస్ ఇంకా కొన్నాళ్లు ఆగి రిలీజ్ చేస్తే వర్కవుట్ అయ్యేవేమో కానీ.. ఇంకా ఆ మెమరీస్ ఫ్రెష్ గానే ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే ఇలాగే ఉంటుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com