Salman Khan Watch Collection : సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్ వర్త్ రూ.140 కోట్లు!

సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్ నికర ఆస్తికి సంబంధించిన వార్త కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఆస్తి విలువ అక్షరాలా రూ.2,900 కోట్లు అని ఇందులో కాస్ట్ వాచ్ల కలెక్షన్ మొత్తం తెలిస్తే షాక్ అవుతారని బాలీవుడ్ వర్గాలు అంటున్నా యి. సల్మాన్ ఖాన్కు పదిహేను రకాల కాస్ట్ వాచ్లున్నాయి. అవి రిచర్డ్ మిల్, రోలెక్స్, జాకబ్ అండ్ కో, ఆడిమర్స్ పీగట్, పాటెక్ ఫిలిప్. ఈ వాచ్ల మొత్తం వాల్యూ అక్షరాలా రూ. 140 కోట్లు. ఈ వాచ్ కలెక్షన్లో రూ.36.6 లక్షల వాచ్ నుంచి రూ.42 కోట్ల ఖరీదైన పాటెక్ ఫిలిప్ మోడల్ లోని లూసీ రెయిన్ బో వాచ్ వరకు 15 కాస్ట్ వాచ్లు ఉన్నాయి. వాచ్ పోర్టర్ అనే ఇన్ స్టా హ్యాండిల్ లో సల్మాన్ ఖాన్ వద్ద ఉన్న వాచీలకు సంబంధించిన సమాచారం ఫొటోలు, వాటి విలువ పోస్ట్ అయ్యాయి. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ కలెక్షన్‌లో కొన్ని ముఖ్యమైన వాచీలు:
పటేక్ ఫిలిప్ అక్వానాట్ ల్యూస్ రెయిన్‌బో: సుమారు రూ. 42 కోట్లు.
జాకబ్ & కో బిలియనీర్ III: సుమారు రూ. 41.28 కోట్లు. ఇందులో 714 వజ్రాలు ఉన్నాయని చెబుతున్నారు.
రిచర్డ్ మిల్లే RM 53-01 పాబ్లో మాక్ డొనఫ్: సుమారు రూ. 21 కోట్లు.
రిచర్డ్ మిల్లే RM 022 ఏరోడైన్: సుమారు రూ. 12 కోట్లు.
ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ డైమండ్: సుమారు రూ. 12 కోట్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com