సల్మాన్ టూ సింపుల్.. జస్ట్ రూ.16 కోట్ల విలువైన సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో..

సల్మాన్ టూ సింపుల్.. జస్ట్ రూ.16 కోట్ల విలువైన సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో..
బి-టౌన్ స్టార్ల ఇళ్ళు చాలా విలాసవంతంగా ఉంటాయి. కోట్ల విలువ చేస్తాయి. అపార్ట్ మెంట్లో ఫ్లాటే అయినా ఖరీదు చాలా ఎక్కువ..

బి-టౌన్ స్టార్ల ఇళ్ళు చాలా విలాసవంతంగా ఉంటాయి. కోట్ల విలువ చేస్తాయి. అపార్ట్ మెంట్లో ఫ్లాటే అయినా ఖరీదు చాలా ఎక్కువ.. వాళ్లు కావాలనుకున్న ఏరియాలో కొనుక్కోవాలనుకుంటే ఎన్ని కోట్లు పెట్టడానికైనా సిద్దంగా ఉంటారు. సంపాదన కూడా అలాగే ఉంటుందిగా మరి.. ఆమాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా.. బిగ్ బీ దగ్గర నుంచి, బాలీవుడ్ బాద్ షా వరకు వారి నివాసయోగ్యాలు రూ.100 కోట్ల పై చిలుకు కూడా ఉంటాయి. కానీ కండల వీరుడు సల్లూ భయ్ మాత్రం కేవలం 16 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్‌లో నివసించడానికి ఇష్టపడతాడు.

ఒక సినిమాతో కోట్లు సంపాదిస్తున్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కొన్నిసార్లు సినిమాలో సగం వాటా మాత్రమే అడుగుతాడు. సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ దాదాపు 2850 కోట్లు, కానీ ఇప్పటికీ 'టైగర్' సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఆశ్చర్యంగానే ఉంటుంది వినేవారికి. కానీ నిజం ఏమిటంటే సల్మాన్ ఖాన్ కేవలం 16 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీని వెనుక 'భాయిజాన్' ప్రత్యేక కారణం చెబుతారు.

ఈ ఇంటితో లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి.

ఈ ఇంటితో తనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని చెబుతాడు సల్మాన్. ఓ ఇంటర్వ్యూలో తాను నివసిస్తున్న ఇంటి గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో నివసిస్తున్నానని, ఈ ఇంటితో తనకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. తన బాల్యం కూడా ఈ ఇంట్లోనే గడిచిందని తెలిపాడు.

సల్మాన్‌కి ఇష్టమైన ఇల్లు అది

సల్మాన్ గత 50 ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. తన కోసం మరో ఇల్లు కొనుక్కోలేక కాదు, సల్మాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విలాసవంతమైన ఇళ్లు ఒకటేంటి రెండు మూడు కొనుక్కున్నా అడగేవారు లేరు. కానీ తనకు ఈ ఇంటితో అపారమైన అనుబంధం వల్ల మరో ఇంటి గురించి ఆలోచించట్లేదని తెలిపాడు.

సల్మాన్ ఇంట్లో వస్తువులు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి

ఇటీవల సల్మాన్ ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలలో సల్మాన్ ఖాన్ ఇంటి లోపలి రూపాలు కూడా కనిపిస్తాయి. ఇందులో ఇంట్లో సాధారణ సోఫా, సాధారణ డైనింగ్ టేబుల్ ఉంటాయి. ఖరీదైన షాన్డిలియర్ లాంటివి కాకుండా చాలా సింపుల్ గా ఉంటే గ్లాస్ హ్యాంగిగ్స్ ఉన్నాయి. మొత్తానికి సల్మాన్ చాలా సింపుల్ లైఫ్‌స్టైల్‌ని గడపడానికి ఇష్టపడతాడు అని తెలుస్తోంది.

బి-టౌన్ ప్రముఖులు నివసించే కొన్ని ఇళ్ల గురించి పరిశీలిస్తే..

షారుక్ ఖాన్ ((Shahrukh Khan ) 200 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా రూ.120 కోట్ల విలువైన జల్సాలో నివసిస్తున్నారు. శిల్పాశెట్టి (Shilpa Shetty) కూడా రూ.100 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story