Samantha : డైరెక్టర్‌తో సామ్ డేటింగ్..! ఫొటోస్ వైరల్

హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య శోభిత దూళిపాలను వివాహం చేసుకొని మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అయితే సమంత మాత్రం తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో సమంత డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియలేదు.
తాజాగా అమెరికా వెకేషన్కు వెళ్లిన సామ్.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ ఫోటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రాజ్ తో ఉన్న ఫోటోలు నెడిసన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని ప్రచారానికి ఈ ఫోటోలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ‘మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది' అనే కొటేషన్ను కూడా సమంత షేర్ చేశారు. ఈ ఫొటోల్లో వీరిద్దరూ క్లోజ్ ఉండడం చూసి కొందరు అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ఐతే రాజ్ సతీమణి శ్యామాలి పోస్ట్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్స్టా స్టోరీ లో ఆమె ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఏ మతం అయినా మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే చెబుతుందని.. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమమని ఆమె పేర్కొన్నారు. సామ్ - రాజ్ ఫొటోలు వైరల్ గా మారిన తరుణంలో శ్యామాలి పెట్టిన ఈ పోస్ట్ చర్చకు దారితీసింది. ఆ ఫొటోల కారణంగా ఆమె బాధపడి ఉండొచ్చని.. అందుకే ఆమె ఈ విధమైన సందేశాన్ని పంచుకుని ఉంటారని పలువురు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com