Samantha Diary : సమంత డైరీ.. కీలకమైన విషయాలు బయటపెట్టిన సామ్

బ్యూటీ ఫుల్ యాక్ట్రెస్ సమంత రుతు ప్రభు డైరీ రాయడంపై కీలకమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది సామ్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటు ప్రతి విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా ఇన్ స్టా లో డైరీ రాయడంపై ఓ పోస్ట్ పెట్టింది. 'నేను రెండేండ్ల నుంచి డైరీ రాస్తున్నాను. నా కిష్టమైన, కష్టమైన క్షణాలు కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఎక్కడ ఉన్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం రాయాలో కూడా అర్థం కాదు. కానీ ఎంత చిన్న విషయమైనా సరే రాసుకోండి, తర్వాత అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. రెండేళ్ల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా.. నాకు ఇదొక గేమ్ ఛేంజర్లా మారింది. అందరూ దీన్ని ట్రై చేయండి.. ఎవరి లైఫ్ ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం' అంటూ సమంత పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com