Parada Movie : పరదా’ సినిమాలో సమంత గెస్ట్ రోల్‌

Parada Movie : పరదా’ సినిమాలో సమంత గెస్ట్ రోల్‌
X

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత గెస్ట్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. క్లైమాక్స్‌లో ఆమె పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సమంత, అనుపమ కలిసి ‘అ ఆ’లో నటించారు. ‘పరదా’ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్‌లో నటిస్తున్నారు.

కాగా ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు .

Tags

Next Story