Samantha : సమంత హాట్ లుక్స్.. ఫోటోలు వైరల్

Samantha : సమంత హాట్ లుక్స్.. ఫోటోలు వైరల్
X

మయో సైటిస్ తో చిన్న బ్రేక్ తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత... 2023లో శాకుంతలం, ఖుషీ చిత్రాలతో మెప్పించింది. రీసెంట్ గా నిర్మాతగా మారి శుభం మూవీని రూపొందించి ప్రశంసలు అందుకుంది. ఇందులో క్యామియో రోల్ లో నటించి అలరించింది. అదే టైంలో గతేడాది సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో సందడి చేసింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ లో యాక్ట్ చేస్తుంది. దాంతోపాటు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తోంది. మరోవైపు ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సామ్.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్టులతో వైరల్ గా మారుతుంది. రీసెంట్ గా తన ఇన్ స్టాలో నయాపిక్స్ ను షేర్ చేసి ఒక్కసారి అందరి చూపును తనవైపు తిప్పేసుకుంది. వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన సామ్.. హాట్, స్టన్నింగ్ లుక్తో అదరగొట్టింది. బ్రౌన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోయింది. మ్యాచింగ్ హీల్స్, న్యూట్రల్ మేకప్, లూజ్ హెయిర్, ఎయిర్ రింగ్స్ తో ఆమె ఈ లుక్ ను మరింత అట్రాక్టివ్ గా మార్చింది. ఈవెంట్ కోసం చాలా బాగా రెడీ అయిన ఈ అమ్మడు.. లోపలకు వెళ్లముందు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్లు, మూవీ లవర్స్ రియాక్టవుతున్నారు. 'క్వీన్ ఆఫ్ ది ఇండియన్ సినిమా' హార్ట్, ఫైర్ ఎమోజీస్ పెడుతున్నారు. సింప్లీ సూపర్బ్ మేడమ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎవర్ గ్రీన్ బ్యూటీ.. హీట్ పుట్టించే లుక్స్.. వార్వెవా అంటూ సందడి చేస్తున్నారు.

Tags

Next Story