Samantha And Nayanthara : సమంత, నయనతార ఓటీటీకే పరిమితం

Samantha And Nayanthara : సమంత, నయనతార ఓటీటీకే పరిమితం
X

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మకుటం లేని మహారాణులుగా ఎదిగి, సినీ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లు కొందరు కేవలం ఓటీటీలోనే మెరవడ గమనార్హం. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది వయో సైటిస్ నుంచి బయటిపడ్డ సమంత రుతు ప్రభు ఈ ఏడాది సినిమాల్లో నటించలేదు. 'సిటాడెల్ హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ కే పరిమితమైంది. ఆమె వరుణ్ ధావన్ తో కలిసి అల్ట్రా యాక్షన్ మోడ్ లో కనిపించారు. కేవలం ఒకే ఒక్క ఓటీటీ సిరీస్లో బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. నయన తార కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్పై సందడి చేయలేదు. తన పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయ్యింది. అది కూడా వివాదాస్పదం కావడం కోర్టు మెట్లెక్కడం గమనార్హం. త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా ఓటీటీలో సందడి చేసింది. మూడేళ్ల పాటు షూటింగ్ జరిగిన ఈ వెబ్ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ యాక్షన థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags

Next Story