Samantha : అలాంటి పాత్రలకు దూరం

సౌత్ స్టార్ సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుండి కూడా ఈ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడారు. " సినీ ఇండస్ట్రీలో మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం నటిగా నా బాధ్యత. ఆడియన్స్‌ను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తుంటారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి. అందుకే సినిమాల్లో పాత్రను ఎంచుకునే సమయంలో ఆచితూచి అడుగులు వేస్తాను. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు తాను దూరంగా ఉంటాను" అని చెప్పింది సామ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com