Samantha : అందుకే హిందీ మాట్లాడను : సమంత

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల నటీనటులతో పాటు సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ చిత్రీకరణ సమయంలో సిటాడెల్ స్క్రిప్ట్ దశలోనే ఉంది. అందుకే మేము సమంతకు దీని గురించి చెప్పలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక హీరోగా వరుణ్‌ను ఎంపిక చేశాం. కథానాయికగా ఎవర్ని తీసుకోవాలని ఆలోచించాం. వరుణ్ హిందీ మాట్లాడతాడు కాబట్టి కథానాయిక కూడా హిందీ మాట్లాడేవారైతే బాగుంటుందనుకున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సమయంలో సమంత హిందీ మాట్లాడలేదు. అందుకే ఆమెను కాకుండా మరొకరిని తీసుకోవాలనుకున్నాం. అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాం. అంత స్పష్టంగా ఎలా మాట్లాడిందో అర్థం కాలేదు. వెంటనే ఆమెతోనే సిరీస్ చేయాలని భావించాం’’ అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ.. ‘హనీ(సిటాడెల్‌లో సమంత పాత్ర)కు హిందీ బాగా వచ్చు. ఈ విషయాన్ని మీరు గుర్తించలేకపోయారు. కాకపోతే ఉచ్చారణలో లోపాలుంటాయేమోనన్న భయంతో నేను వేదికపై హిందీలో మాట్లాడను’ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com