Samantha : నిర్మాతగా సమంత రెండో సినిమా
X
By - Manikanta |30 Oct 2024 7:00 PM IST
సౌత్ బ్యూటీ సమంత ట్రాలాల పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ పేరుతో తొలి సినిమా చేయనుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక మొదటి సినిమా విడుదల కాకముందే మరో సినిమాను మొదలుపెట్టింది సామ్. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే రెండు వారాల పాటు షూటింగ్ జరిగిందని, తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్-హనీ బన్ని’ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com