Samantha: ఆలయ ప్రాంగణంలో సమంత.. అందుకేనేమో..
Samantha: మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న నటి సమంత వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, సమంత ఆలయాలు సందర్శిస్తూ, దేవుడికి ప్రార్థిస్తుంది. తాను త్వరగా కోలుకుని మామూలు మనిషిని కావాలని అభిషేకాలు, అర్చనలు చేయిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తమిళనాడులోని పళని ఆలయాన్ని సందర్శించింది.
కొండపై ఉన్న ఆలయం వైపు వెళ్లే మార్గంలో మాస్క్‌తో కనిపించిన సమంత ఆలయానికి చేరుకుని పళని స్వామికి ప్రత్యేక పూజలు చేసింది. సమంత దర్శనానికి ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. మీడియాకు మాత్రం సమాచారం అందించకుండా జాగ్రత్త పడ్డారు. అయినా పళని ఆలయంలో సమంత ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
సమంత చేతిలో కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆమె సంబంధిత చిత్రనిర్మాతలకు తన కమిట్‌మెంట్‌లను కొనసాగించాల్సి ఉంది. దైవం కరుణించాలని, ఆమె ఆరోగ్యం కుదుట పడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
సమంత నటించిన 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్ 14కి వాయిదా పడింది. విజయ్ దేవరకొండతో 'ఖుషి' పూర్తి చేయాల్సి ఉంది. దాని తరువాత వెబ్ సిరీస్ అయిన 'సిటాడెల్' ఇతర ప్రాజెక్ట్‌లు సమంత కోసం వెయిట్ చేస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com