Samyuktha Menon : గులాబీ రంగు పట్టుచీరలో సంయుక్త మీనన్

గులాబీ రంగు పట్టుచీ రలో మెరిసిపోతున్న ఈ భామ సంయుక్త మీనన్. ఈ మాలీవుడ్ బ్యూటీ .. టాలీవుడ్ లోనూ భారీ క్రేజీనే కొట్టేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫేమ్ సాధించిందీ భామ. తనకంటూ ప్రత్యేంగా ఓ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది. మాలీవుడ్ మూవీ పాప్ కార్న్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ అందరినీ మెప్పించారు. మూడేళ్ల క్రితం ఎరిడ చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది తెలుగు సినీ ప్రియులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో పలకరించింది సంయుక్త. ఇక బింబిసా హిట్ తో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. సార్ మూవీతో ఆమె కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి. అందులో తన నటనతో ఫిదా చేశారు. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ విరూపాక్షతో కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరో నిఖిల్ తో స్వయంభూ సినిమా చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా పొటో షూట్లు చేస్తున్న ఈ భామ. గులాబీ రంగు పట్టు చీరలో మెరిసి పోతూ ఇలా ఫొటోలకు పో జులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com