Tollywood : భైరవం'లో సందీప్ రాజ్

X
By - Manikanta |23 Nov 2024 3:30 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భైరవం. తమిళ సూపర్ హిట్ సినిమా గరుడన్ సినిమాకు ఇది రీమేక్. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి మరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఆ పాత్ర పేరు పులి రవీంద్ర. ఈ పాత్రలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ నటిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారాడు. తాజాగా పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మరి నటుడిగా ఈ సినిమాలో సందీప్ రాజ్ ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com