Mahesh Babu : మహేష్ బాబును వదిలిపెట్టను..
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ అంటే ఎవరైనా మాగ్జిమం ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఎక్స్ పెక్ట్ చేయాల్సిన పనిలేదు ఖచ్చితంగా ఇస్తాడు అనిపించే దర్శకులు కొందరుంటారు. కథల పరంగా కేవలం రెండు సినిమాలతోనే అలా అనిపించేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ తో కంట్రీ మొత్తం షేక్ చేశాడు. అయితే యానిమల్ కంటే ముందే అతను మహేష్ బాబుతో ‘డెవిల్’ అనే మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో మహేష్ ఓే చెప్పలేదు. విశేషం ఏంటంటే.. అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు చాలామంది ఇండస్ట్రీ వాళ్లు కామ్ గా ఉంటే.. మహేష్ మాత్రం సందీప్ ను ఇంటికి పిలిచి మరీ అప్రిసియేట్ చేశాడు. అప్పటి నుంచే వీరి కాంబోలో సినిమా వస్తుందని భావించారు. సందీప్ కూడా డెవిల్ కథ అప్పుడే చెప్పాడు. బట్ మహేష్ ఆ కథకు ప్రిపేర్డ్ గా లేనట్టుంది. అందుకే నో అన్నాడు.
కట్ చేస్తే యానిమల్ తో మరోసారి కంట్రీని షేక్ చేశాడు సందీప్. నెక్ట్స్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీకి ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే స్పిరిట్ చేసినా.. మరో హీరోతో మరోటి చేసినా.. ఎప్పటికైనా మహేష్ ను వదలను అంటున్నాడు సందీప్. ఏదో రోజు డెవిల్ కథనే మహేష్ తో చేస్తా అంటున్నాడు. మరి ఆ కథలో అంత మేటర్ ఏం ఉందని ఇతను కాన్పిడెంట్ గా ఉన్నాడో కానీ.. మహేష్ ఎందుకు నో అన్నాడో ఆ యాంగిల్ లో కూడా ఆలోచించి మరో స్టోరీతో వెళితే పనవుతుందేమో కదా. ఏదేమైనా సందీప్, మహేష్ కాంబో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com