Nari Nari Naduma Murari : ఒక్కోటిగా వస్తున్న సంక్రాంతి మూవీస్

Nari Nari Naduma Murari :  ఒక్కోటిగా వస్తున్న సంక్రాంతి మూవీస్
X

సంక్రాంతికి విడుదలైన అన్ని మూవీస్ కూడా మాగ్జిమం ఆకట్టుకున్నాయి. ఒక్క రాజా సాబ్ తప్ప.ఈ మూవీ కూడా బానే ఉన్నట్టుగా అనిపించినా ప్రభాస్ ఇమేజ్ ముందు నిలవలేకపోయింది. ఆ ఒక్క కారణంతోనే ఇబ్బంది పడింది. తర్వాత నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలకూ పాజిటివ్ టాక్ తో పాటు రివ్యూస్ కూడా వచ్చాయి. ఇక మన శంకర వరప్రసాద్ గారు మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. తెలుగు నుంచి మాత్రమే ఈ మూవీ ఆల్ టైమ్ హయ్యొస్ట్ కలెక్షన్స్ అనే టాక్ కూడా వచ్చింది. తర్వాత అనగనగా ఒక రాజు చాలా పెద్ద విజయం సాధించింది. ఆపై భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ మూవీస్ ఇక ఓటిటికి టైమ్ ఫిక్స్ అయ్యాయి. ఓటిటిలో ఏ మూవీ ఏ రోజు విడుదల కాబోతోంది అనేది చూద్దాం.

చాలా పెద్ద హిట్ టాక్ వచ్చినా సరిపడా థియేటర్స్ సరిపోలేదు అనే కారణంతో నారీ నారీ నడుమ మురారి అందరికంటే ముందుగా ఓటిటిలో వస్తోంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ 4న విడుదల కాబోతోంది. మరి ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో కానీ ఈ బుధవారం నుంచే నారీనారీ నడుమ మురారి స్ట్రీమ్ కాబోతోంది.

ఈ నెల 6 నుంచి ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ విడుదల కాబోతోంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమ్ కాబోతోంది. సినిమాకు థియేటర్స్ లో నెగెటివ్ రివ్యూస్ వచ్చినా ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ నెల 13నే మిగతా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మన శంకర వరప్రసాద్ గారు మాత్రం కాస్త ముందుగానే విడుదలయ్యే అకవాశాలున్నాయి. ఇక ఈ 13నే అనగనగా ఒక రాజు ఓటిటిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయబోతున్నారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌధరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించాడు. ఇప్పటికే థియేటర్స్ లో వంద కోట్లకు మించి కొల్లగొట్టిన ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి రివ్యూస్ తెచ్చుకుంటోంది అనేది చూడాలి.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ భర్తలకు మహాశయులకు విజ్ఞప్తి. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ మూవీని జీ5లో ఫిబ్రవరి 13నుంచి స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఈ డేట్ ఇంకా అఫీషియల్ గా తేల్చలేదు. అయినా అదే రోజునే విడుదలవుతుందని స్ట్రాంగ్ గా చెబుతున్నారు.

ఇక మెగాస్టార్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మన శంకరవరప్రసాద్ గారు ఈ నెల 11 నుంచి స్ట్రీమ్ అవుతుందని మాత్రం చెబుతున్నారు. మరి ఇదే డేట్ కే విడుదల చేస్తారా లేక 13 నుంచి స్ట్రీమ్ అవుతుందా అనేది తేలాల్సి ఉంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని కూడా జీ 5లోనే స్ట్రీమ్ కాబోతోంది. కాకపోతే వీళ్లు కూడా ఇంకా ఖచ్చితంగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

Tags

Next Story