Sankranthiki Vasthunam : వంద కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం.. పాజిటివ్ టాక్ తో వసూళ్ల వరద

Sankranthiki Vasthunam : వంద కోట్ల క్లబ్ లో సంక్రాంతికి వస్తున్నాం.. పాజిటివ్ టాక్ తో వసూళ్ల వరద
X

విక్ట‌రీ వెంక‌టేశ్ - అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం' వసూళ్ల వేగం పెరిగింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. సంక్రాంతి వేళ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవుతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డం, పైగా సంక్రాంతి పండ‌గ సీజ‌న్‌కు రావ‌డంతో సినిమా భారీ క‌లెక్ష‌న్లను రాబడుతోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 106 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు ప్ర‌క‌టించారు. ఎనీ సెంట‌ర్ సింగిల్ హ్యాండ్‌.. విక్ట‌రీ వెంక‌టేశ్ అంటూ స్పెష‌ల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చిత్రానికి తొలి రోజు వ‌రల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్లు వ‌సూళ్లు.. రెండు రోజుల్లోనే రూ. 77 కోట్లకు చేరింది. మూడో రోజు వంద కోట్ల మైలురాయి దాటింది.

Tags

Next Story