Sankranthiki Vastunnam : బాక్సాఫీస్ వద్ద 'సంక్రాంతికి వస్తున్నాం' సందడి

Sankranthiki Vastunnam : బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం సందడి
X

విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కంటే ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి కలెక్షన్లు పుంజుకుంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త థియేటర్లు యాడ్ అవుతాయని అంటున్నారు.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఓవరాల్ గా నైట్ షోలు కూడా ఫెంటాస్టిక్ లెవల్ లో కొనసాగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ మార్క్ ని రీచ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 16 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు .. వరల్డ్ వైడ్ గా 36 కోట్లు వసూళ్లను సాధించింది. కనీసం 85 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే మూవీ లాభాల్లోకి వెళ్లనుంది. ఈ జీగా డబుల్, ట్రిపుల్ కలెక్షన్లు సాధిస్తుందని చెబుతున్నారు.

Tags

Next Story