Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.45కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకటేశ్‌కు ఇవే ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
వెంకటేష్ కెరీర్‍లోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆల్ టైమ్ కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. నిజానికి ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలని మించి సినిమా డే 1 కలెక్షన్లు రాబట్టింది. పండగ హడావిడి ముగిసేలోపు సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర గట్టి ప్రభావమే చూపించనుంది.
ఇక ఈ సినిమాతో అనిల్ రావిపూడి-వెంకటేష్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన F2, F3 రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంతకంటే పెద్ద హిట్‌గా నిలవబోతుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక వెంకీ డీలా పడ్డారు. ఇలాంటి వేళ తనకి బాగా అచ్చొచ్చిన ఫ్యామిలీ జోనర్ పడటంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com