Sankranti Ki Vastunnam : సంక్రాంతి కి వస్తున్నాం .. ఐదో రోజు సెకండ్ ప్లేస్

విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతి కి వస్తున్నాం వరుస రికార్డులతో టాక్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాతి స్థానాన్ని సంపాదించుకొని సరికొత్త బజ్ క్రియేట్ చేసింది. ఇంతకూ విషయం ఏమిటంటే ఐదో రోజు కలెక్షన్లలో కల్కి, బాహుబలి-2, అలవైకుంఠ పురంలో సినిమాలను వెనక్కి నెట్టేసింది. ఈ సినిమా ఐదో రోజు రూ. 12. 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఐదో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. మొదటి స్థానంలో 'ఆర్ఆర్ఆర్' (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం (రూ.12.75కోట్లు) నిలిచింది. మూడులో 'అల వైకుంఠపురం' (రూ.11.43 కోట్లు), నాలుగులో 'బాహుబలి 2' (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో రూ.10.86 కోట్లతో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ఉన్నాయి. అటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టి స్తోంది. దీంతో విక్టరీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com