Sankranti Ki Vostunnam : 300 కోట్ల కబ్ లో సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి అలా సరదాగా వచ్చిన వెంకీమామ ఇప్పడు రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇవాల్టి వరకు రూ. 303 కోట్ల వసూళ్లను సాధించిందని ప్రకటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించాడు. తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్ నుంచి సీనియర్ నటులలో రూ.300 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన నటుడిగా వెంకీ మామ రికార్డు సృష్టించాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే వచ్చింది. విడుదలైన మొదటి రోజు నేంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అతి తక్కువ సమయంలో వంద కోట్ల షేర్‌ను రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఏళ్ల తరబడి సినిమా థియేటర్‌కి దూరంగా ఉన్న వారికి సైతం ఈ సినిమా థియేటర్‌కి రప్పించింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కింది. అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా రికార్డ్‌లు బ్రేక్ చేస్తూ వచ్చింది. పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com