Sankranti Ki Vostunnam : ఇవాళ టీవీ, ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం

Sankranti Ki Vostunnam : ఇవాళ టీవీ, ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం
X

అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇవాళ టీవీ, ఓటీటీలోకి రానుంది. సా.6గంటలకు జీతెలుగు ఛానల్‌లో, జీ5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి టీవీ, ఓటీటీలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5, జీ తెలుగులో వస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతోంది. నా జీవితంలో ఈ చిత్రం ఓ మరుపురాని అద్భుతం. వెంకటేష్ దగ్గుబాటి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయేల అద్భుతమైన ప్రదర్శనలు కథను మరింత ఎలివేట్ చేశాయి. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ డ్యూయల్ రిలీజ్ ప్రతి ఒక్కరూ ఆనందించేలా ఉంటుంది" అని అన్నారు.

Tags

Next Story