Bollywood Actress : శ్రీశైలంలో సారాఅలీఖాన్ సందడి

Bollywood Actress : శ్రీశైలంలో సారాఅలీఖాన్ సందడి
X

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గారాల పట్టి సారా అలీఖాన్. 2018లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంటోంది. సారా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి సిక్కు. సారా మాత్రం అన్ని మతాలు తనవే అంటుంది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అన్ని మతాల పవిత్ర ప్రదేశాలను దర్శించుకుంటుంది. ఆమె మహా శివుడి భక్తు రాలు. ప్రతి సంవత్సరం కేదార్నాథ్ యాత్రకు వెళ్తుంది. స్నేహితులని కూడా తీసుకెళ్తుంది. తాజాగా ఆమె పోస్టు చేసిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఆమె ఈ ఏడాది తొలి సోమవారం కర్నూల్ లోని శ్రీశైల మల్లిఖార్జునుడి వద్ద గడిపింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో సారా.. భక్తిని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Next Story