Sarangapani : ఓటీటీలో సారంగపాణి జాతకం.. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్

Sarangapani : ఓటీటీలో సారంగపాణి జాతకం.. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్
X

కమెడియన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. సినిమాలు మాత్రమే కాదు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి టాక్ ని సొంతం చేసుకున్నా రు. ఈ ఏడాది ప్రియదర్శి పంట పండింది. నాని నిర్మించిన కోర్టు మూవీలో నటించాడు. ఆ మూవీ భారీ విజయం అందుకోవడంతో ఆ తర్వాత సారంగపాణి జాతకం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రియదర్శి హీరోగా, రూపా కొడవాయూర్ హీరోయిన్ గా నటించిన మూవీ సారంగపాణి జాతకం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్లో 'జెంటిల్ మన్, సమ్మోహనం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడవ చిత్రంగా ఈ మూవీ వచ్చింది. మొదటినుంచి భారీ అంచనాలనే క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కామెడీ కారణంగా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Tags

Next Story