Karthi : సర్దార్ 2 కాన్సెప్ట్ ప్రేక్షకులను భయపెడుతుంది: కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Karthi : సర్దార్ 2 కాన్సెప్ట్ ప్రేక్షకులను భయపెడుతుంది: కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో కార్తి హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్దార్ 2'. ఈ చిత్రంలో ఎస్ఓ సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. యువన్ శంక రాజా సంగీతాన్ని, జార్జ్ విల్లియమ్స్ ఛా యాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. తాజాగా మేకర్స మూవీ ఫస్ట్ లుక్, ప్రోలాగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఈ వీడియో, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'సర్దార్' విడుదలయ్యాక చాలా మంది వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగేందుకు భయపడ్డారు. అదే విషయాన్ని తెలియజేస్తూ మాకు మెసేజ్లు పంపారు. పార్ట్ 2 చూస్తే ప్రేక్షకులు తప్పక కంగారు పడ్తారు. మిత్రన్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేనూ షాకయ్యా. ఇది ప్రేక్షకులను మరింత భయపెడుతుంది' అని తెలిపారు.

Tags

Next Story