Vijay Deverakonda : మూర్ఖుడిని కాదని చెప్పండి .. విజయ్ దేవరకొండ సందేశం

Vijay Deverakonda : మూర్ఖుడిని కాదని చెప్పండి .. విజయ్ దేవరకొండ సందేశం
X

సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ హీరో విజయ్ దేవరకొండ సూచించారు. ఫేక్ కాల్స్, మెసేజ్లపై అవ గాహన కల్పించేలా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తన ఫ్రెండ్ విషయంలో జరిగిన ఓ ఘటనను వివరిస్తూ.. యూపీఐ పేమెంట్ సేఫ్ అని గుర్తుచేశారు. 'ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే.. నేను మూర్ఖుడిని కాదు' అని చెప్పండి' అని పేర్కొన్నారు. స్నేహితుడిని, శ్రేయోభిలాషిని అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జా గ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు అకౌంట్ లో మనీ క్రెడిట్ అయినట్టు సైతం మెసేజ్లు సృష్టిస్తారని గుర్తుచేశారు. ఒకవేళ.. అలాంటి మెసేజ్లు వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టే టెమెంట్ చూసుకోవాలన్నారు. ఒక సినిమాల విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘వీడీ 12’ లో విజయ్ నటిస్తున్నారు. ఈ మూవీ వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా, రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్లో ఓ చిత్రం ఖరారు చేశారు.

Tags

Next Story