Kubera : జూన్ 20వ తేదీన శేఖర్ కమ్ముల కుబేర రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నాగార్జున, నేషన్ క్రష్ రష్మిక మందన్న తదితరులు నటి స్తుండటంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మి స్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కు మంచి ఆదరణ లభించింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించగా అక్కినేని నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరిశాడు. జూన్ 20న వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను ప్ర కటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేమ కథలకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల తన పంథా మార్చుకుని చేస్తున్న కుబేర ధనుష్ కు తెలుగులో మరో హిట్ సినిమా వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com