అనసూయ, రోజా.. కనీస బాధ్యత లేదా..!

యాంకర్ అనసూయ ఇప్పుడు ఏ రేంజ్ లో శివాజీ మీద రెచ్చిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. హీరోయన్ల బట్టల మీద నటుడు శివాజీ రెండు పదాలు తప్పుగా మాట్లాడటంతో రెచ్చిపోయి వీడియోలు చేసి అతన్ని తిట్టింది ఇదే యాంకర్ అనసూయ. ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛ అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చింది. బట్టలు పద్ధతిగా వేసుకోండి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అసభ్యకరంగా బట్టలు వేసుకోకండి అని చెప్పటం కూడా తప్పే అంటూ ఆమె ఏ స్థాయిలో మాట్లాడిందో మనం చూశాం కదా. మరి జబర్దస్త్ షోలో గతంలో హైపర్ ఆది వేసిన స్కిట్ లో రాశి గారి ఫలాలు అంటూ హీరోయిన్ రాశిని బాడీ షేవింగ్ చేసినప్పుడు ఆమెకు ఈ విషయం అర్థం కాలేదా. ఇప్పుడు హీరోయిన్ రాశి దానిమీద రియాక్ట్ అయి అనసూయ మీద ఫైర్ అవడంతో ఒక చిన్న స్టోరీ పెట్టి సారీ చెప్పేసింది అనసూయ. శివాజీ మీద అంత పెద్ద వీడియోలు చేసిన అనసూయ రాశికి సారీ చెప్పేటప్పుడు కూడా ఒక వీడియో చేస్తే బాగుండేదేమో అంటున్నారు నెటిజన్లు.
ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛ గురించి మాట్లాడే అనసూయ సాటి హీరోయిన్ ను బాడీ షేమింగ్ చేసింది. అలాంటి అనసూయకు ఆడవారి స్వేచ్ఛ గురించి మాట్లాడే హక్కు ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఒకవేళ నిజంగానే అనసూయకు చిత్తశుద్ధి ఉంటే రాశి స్పందించక ముందే క్షమాపణలు చెప్పి ఉండాల్సింది. అలాంటి చిత్తశుద్ధి పశ్చాత్తాపం ఏది లేవు కాబట్టే అనసూయ చిన్న స్టోరీ పెట్టి సారీ అని చేతులు దులుపుకుంది. పైగా తాను అప్పుడు ఫైట్ చేశాను అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతుంది. ఇదే షోలో జడ్జిగా ఉన్న రోజా అనసూయ మాటలకు పగలబడి నవ్వింది. అంతేగాని సాటి హీరోయిన్ మీద బాడీ షేమింగ్ చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అడ్డు చెప్పలేదు.
సాటి హీరోయిన్ అని కూడా రోజాకు అనిపించలేదా.. పైగా ఇప్పుడు రాశి రియాక్ట్ అయిన తర్వాత కూడా కనీసం సారీ చెబుతూ రోజా స్పందించలేదు. అనసూయ లాగా కనీసం ఒక స్టోరీ అయినా పెట్టలేదు. మహిళల హక్కుల గురించి మాట్లాడే రోజా.. తాను మాత్రం ఎవరి మీద అయినా ఇష్టం వచ్చినట్టు మాటలు అనేయొచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గతంలో తనను, తన పిల్లలను ట్రోల్ చేస్తున్నారు బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ ఎమోషనల్ డైలాగులు కొట్టింది ఇదే రోజా. మరి తానే స్వయంగా ఒక హీరోయిన్ మీద బాడీ షేమింగ్ చేస్తుంటే ఎందుకు పగలబడి నవ్వింది. అంటే తన విషయంలో ఒకలాగా సాటి హీరోయిన్ విషయంలో ఇంకోలాగా రోజా ప్రవర్తన ఉంటుందా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

