Actress Khushbu : సీనియర్ నటి ఖుష్బు సుందర్ కి గాయం

సీనియర్ నటి ఖుష్బు సుందర్ కి గాయం ఒకప్పుడు తెలుగు, తమిళ్ చిత్రాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ.. హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఖుష్బూ.. ఈ మధ్య జబర్దస్త్ వేదికపై జడ్జిగా వ్యవహరిస్తూ.. తన కామెడీ పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కమెడియన్స్ తో కలగలిసిపోయి జోకులు వేస్తూ.. పంచులు విసురుతూ భారీ పాపులారిటీ అందుకుంది ఖుష్బూ. దీంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు అయిందని చెప్పవచ్చు. గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఈమె కెరియర్ కు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా నటి ఖుష్బు సుందర్ గాయపడ్డారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా ఆగిపోవద్దని, చిరునవ్వుతో ముందుకు సాగాలని రాసుకొచ్చారు. కాగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com