Shahrukh Khan : ఉదయం 5గంటలకు నిద్రపోతా: షారుఖ్ ఖాన్

అందరితో పోలిస్తే తన దినచర్య పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘అమెరికన్ యాక్టర్ మార్క్ వాల్బర్గ్ నిద్రలోంచి లేచే సమాయానికి నేను పడుకుంటా. షూటింగ్ రోజుల్లో ఉదయం 5 గంటలకు నిద్రపోయి 10 గంటలకు లేస్తాను. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తా. షూట్‌కి వెళ్లి అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వచ్చి స్నానం, వర్కౌట్ చేసి పడుకుంటా’ అని తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు నేను స్క్రీన్ మీదా కనిపించపోయేసరికి నా అభిమానులు చాలా నిరాశ చెందారు. అందుకే వరుస సినిమాలు చేస్తున్నా. ఇకపై మళ్లీ అలా చేయను అంటూ షారుఖ్ చెప్పుకోచ్చాడు. డంకీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న షారుఖ్ తాజాగా కింగ్ అనే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. అభిషేక్ బచ్చన్, ఫాహిమ్ ఫాజ్లీ, సుహానా ఖాన్లు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com