DUNKI Ott : ఓటీటీలోకి షారుక్ ఖాన్ 'డంకీ'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా

ఐదేళ్ల తర్వాత గతేడాది పఠాన్ తో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు షారుక్ ఖాన్. జవాన్ తో మరో హిట్ కొట్టాడు. వరుస హిట్లతో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించారు. ఇక గతేడాది చివరలో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ సినిమాతో షారుక్ అలరించారు.
యానిమల్, సలార్ లాంటి సౌత్ డైరెక్టర్లు తీసిన సినిమాల కాంపిటీషన్ లో కొద్దిగా వెనుకబడింది షారుక్ మూవీ. ఐతే.. మౌత్ టాక్, నార్త్ సెంటిమెంట్ తో కొంత కలెక్షన్లను అందుకోవడంలో సక్సెస్ అయింది. ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరించింది.
ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.230 కోట్లు వరకూ నెట్ వసూళ్లతో పాటు రూ. 470 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లను సాధించింది. లాభాలను అందుకుని క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 180 కోట్లకు దక్కించుకుంది. తాజాగా ‘డంకీ’ సినిమా సైలెంట్ గా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే స్ట్రీమింగ్కు తీసుకొచ్చి అభిమానులను నెట్ ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com