Shakila Biopic : ఓటీటీలో షకీలా బయోపిక్

నటి షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలో రిలీజైంది. రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ, ఎస్తర్ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్ లంకేశ్ దర్శకత్వంలో ప్రకాష్ పళని సమర్పణలో సమ్మి నవ్వనీ, శరవణ ప్రసాద్ హిందీలో 'షకీలా' చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.ఈ సినిమా థియేటర్స్ లో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సడెన్ గా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు వెర్షన్ కోసం ఎక్స్ వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్లో కూడా ఈ చిత్రాన్ని చాలామంది షేర్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు కూడా భారీగా నష్టపోయారు. అయితే, తెలుగు వర్షన్ కూడా మరో రెండురోజుల్లో స్టీమింగ్ కు రావచ్చని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com